WHITTLEKAR SCHOOL – SAMALKOT, PEDDAPURAM

విట్టికర్ విద్యాలయం


జంట పట్టణాల మధ్య మొట్ట మొదటి పాఠశాల
రెవరెండ్ ఆడం లాంగ్ మహాశయుడి మహోన్నత ఆశయం నుండి మొలకెత్తిన విద్యా వృక్షమే విట్టికర్ విద్యాలయం

1850 సంవత్సరంలో రెవరెండ్ ఆడం లాంగ్ గారు 12 ఎకరాల సువిశాల స్థలాన్ని కొనుకోలు చేసి పెద్దాపురం మరియు సామర్లకోట పరిసరప్రాంతాలకు ఆధునిక, మరియు సాంకేతిక విద్యను అందించాలనే మహోత్తమమైన లక్ష్యంతో లూథరన్ క్రిస్టియన్ మిషినరీ స్కూల్ ప్రారంభించారు… ఆ స్కూల్ లో మొదటి సంవత్సరం ఆంగ్లేయులు భారతీయులు కలిపి 35 మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు…

1918 వ సంవత్సరంలో మేరీ బాత్విక్ గారి ఆధ్వర్యంలో బాలికల బోర్డింగ్ స్కూల్ గా ఆవిర్భవించింది, అనంతరం కుమారి పాల్ విట్టికర్ గారు బాలికల బోర్డింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ బాధ్యతలు చేపట్టారు దురదృష్టవశాత్తూ కుమారి పాల్ విట్టికర్ గారు ఆకస్మిక మరణం పాలయ్యారు ఆమె సంస్మరణార్ధం కుమారి విట్టికర్ పేరు మీదనే ఆనాటి నుండి విట్టికర్ బాలికల పాఠశాల గా పిలవబడుతుంది. @వంగలపూడి శివకృష్ణ

1174total visits,3visits today