March 28, 2018
WOMEN HYGIENE AWARENESS CAMP, PEDDAPURAM
జగమెరిగిన సత్యానికి దాపరికం ఎందుకు…?
మన పెద్దాపురం గ్రూప్ మూడవ వార్షికోత్సవం సందర్బంగా “జగమెరిగిన సత్యానికి దాపరికం ఎందుకు” అంటూ వినూతన అవహగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది… ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం పెద్దాపురంలో ప్రభుత్వ ఆసుపత్రులలో మరియు బాలికోన్నత పాఠశాలలు బాలికల వసతి సముదాయాలలోని బాలికలకు, యువతులకు, మహిళలకు మహిళా డాక్టర్లు మరియు విద్యావంతులైన సామాజిక కార్యకర్తలు ఉపాధ్యాయినీల ద్వారా నెలసరి రుతుక్రమ సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటిపైన అపోహలు శానిటరీ ప్యాడ్స్ వాడకం వాటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని భావించడం జరిగింది దానిలో భాగంగా తేదీ. 28.03.2018 న పెద్దాపురం బాలికోన్నత పాఠశాల విద్యార్థినులకు ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ జయలక్ష్మి గారు, లిట్రసీ చైర్మన్ సీతాదేవి గారు , 18 వార్డు కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ గారు, మహారాణీ కళాశాల మాథ్స్ లెక్చరర్ సిద్దపురెడ్డి చక్రవేణి గారు పాల్గొని విద్యార్థినులకు బహిష్టు సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై అవగాహన కల్పించారు, అనంతరం శానిటరీ పాడ్స్ వాడకం పై అవగాహన కల్పించి విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్ ని ఉచితంగా పంచడం జరిగింది…
1950total visits,1visits today
One Comment
Excellent programme was conducted. It will be very useful for all women.